Monday, December 23, 2024

సనత్ నగర్ లో నరబలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: భాగ్యనగరంలో సనత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ 8 ఏళ్ల బాలుడ్ని నరబలి ఇచ్చింది. ఈ ఘటనలో బలైన బాలుడు అబ్దుల్‌ వహీద్‌గా గుర్తించారు. అమావాస్య రోజున ఓ మహిళ బలి ఇచ్చినట్లుగా స్థానికుల ఆరోపిస్తున్నారు. ఓ నాలా సమీపంలో బాలుడి మృతదేహం లభించడంతో సదరు మహిళ ఇంటిపై స్థానికులు దాడికి దిగారు. దీంతో సనత్‌నగర్‌లోని అల్లాదున్ కోఠి ఏరియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ఇది పంజాబ్.. ఇండియా కాదు(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News