Thursday, December 26, 2024

బాలుడి ప్రాణం తీసిన కారు….

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: కారులో ఊపిరాడక బాలుడు దుర్మరణం చెందిన సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రుక్కితండాలో బానోతు అశోక్-అనూష అనే దంపతులు వ్యవసాయం సాయం జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు పార్థూ(4), వర్షిత్(3) అనే పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలను అంగన్‌వాడీకి పంపించి అనంతరం వ్యవసాయ పనులకు పొలం వద్దకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో పిల్లలను అంగన్‌వాడీ ఆయా పిల్లల మేనత్తకు వారిని అప్పగించింది. పార్థూ ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు ఉన్న కారులోకి వెళ్లాడు. కారు డోర్ మూసుకోవడంతో ఊపిరాడక పార్థూ చనిపోయాడు. కారులో ఉన్న పార్థూను కుటుంబ సభ్యులు గుర్తించి స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు.

Also Read: కువైట్‌లో రోడ్డు ప్రమాదం… నలుగురు తెలుగువారు మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News