అమరావతి: చేప పిల్ల గొంతులో ఇరుక్కొని 9 నెలల పసి బాలుడు మృతి చెందిన సంఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చెరుకువాడ చిన పేట తోలాపు గ్రామంలో నారాయణ- సుధారాణి అనే దంపతులు నివసిస్తున్నారు. 2019లో వీరికి వివాహం జరిగింది. ఈ దంపతులకు 9 నెలల బాలుడు ఉన్నాడు. నారాయణ గొరక రకం చేపలు ఇంటికి తీసుకొచ్చి కూర వండాలని భార్యకు సూచించాడు. చేపలను తీసుకరాగానే ఓ బకెట్లో వేశాడు. అందులో కొన్ని ప్రాణంతో ఉండడంతో తన బాలుడు నందకిశోర్ తో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో నంద కిశోర్ గొంతులోనికి చేప పిల్ల వెళ్లడంతో ఎంత తీసిన బయటకు రాలేదు. బాలుడు కళ్లు తేలయడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు చనిపోయాడని తెలిపారు. తన భర్త కావాలనే తన బిడ్డను పొట్టన పెట్టుకున్నాడని భార్య ఆరోపణలు చేసింది. భర్త తనని వేధించడంతో పాటు అనుమానించేవాడు. పలుమార్లు దంపతుల మధ్య గొడవలు జరిగాయని బంధువులు తెలిపారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎస్‌ఐ రవి కుమార్ తెలిపాడు. బాలుడి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించామని ఎస్ఐ పేర్కొన్నాడు.
చేపపిల్లతో ఆటాడిస్తుండగా బాలుడి మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -