Thursday, March 13, 2025

బాలుడి ప్రాణం తీసిన లిఫ్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాలుగేళ్ల బాలుడు లిఫ్ట్‌లో ఇరుక్కొని మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సంతోష్‌నగర్ కాలనీలోని ముజ్తాబా అపార్ట్‌మెంట్‌లో శ్యామ్ బహదూర్ అనే వ్యక్తి వాచ్‌మెన్ పని చేస్తున్నాడు. అపార్ట్‌మెంట్‌లో చిన్న గది ఇవ్వడంతో నేపాల్ నుంచి తన కూతురు, భార్యను తీసుకొని వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. శ్యామ్ బహదూర్ కుమారుడు సురేందర్ ఆడుకుంటూ లిఫ్ట్ వద్దకు వెళ్లాడు. పది నిమిషాల తరువాత తన కుమారుడు ఎక్కడా ఉన్నాడని వెతకగా లిఫ్ట్‌లో రక్తపు మడుగులో కనిపించాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బతుకుదెరువు కోసం నేపాల్ నుంచి ఇక్కడికి వస్తే తన కుమారుడు ప్రాణాలు పోయాయని లబోదిబోమంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News