Monday, January 13, 2025

పురుగుల మందు తాగి బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

కీసర: పరుగుల మందు సేవి ంచి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన సోమవారం కీసరలో జరిగింది. కీసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కీసరకు చెందిన సుధాకర్, సరిత దంపతుల కుమారుడు రాహుల్ (16) ఇటీవల పదో తరగతి చదివాడు. ఆదివారం కీసరలోని ధనలక్ష్మీ ఫర్టిలైజర్ దుకాణం లో గడ్డి మందు కొనుగోలు చేశాడు. సోమవారం కీసర సమీపంలోని పర్వతాపూర్ గుట్టల్లోకి వెళ్లి ఇంట్లో వారికి వీడియో కాల్ చేసి తాను చనిపోతున్నట్లు చెప్పాడు. ఆందోళనకు గురైన రాహుల్ తల్లిదండ్రులు అతని స్నేహితులతో కలిసి కారులో వెళ్లి వెతికారు.

గుట్టల్లో పరుగుల మందు సేవించి ఆపస్మారక స్థితిలో పడి ఉన్న అతన్ని 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఈసీఐఎల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రాహుల్ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. బాలుడికి నిబంధనలకు విరుద్ద్ధంగా పురుగుల మందు విక్రయించిన కీసరలోని ధనలక్ష్మీ ఫర్టిలైజర్ దుకాణం ఎదుట మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన నిర్వహించారు. బాలుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News