Friday, December 27, 2024

డాబా పైనుండి పడి బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

వాజేడు : ప్రమాదవశాత్తు డాబా పై నుండి పడి బాలుడు మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా, వాజేడు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… మండలంలోని కడేకల్ గ్రామానికి చెందిన యార్మ హరినాధ్, కృష్ణవేణి దంపతుల కుమారుడు యార్మ తేజ (9) సోమవారం ఉదయం తమ ఇంటి డాబా పై ఆడుకొని నిచ్చెన సహాయంతో కిందకి దిగుతుండగా నిచ్చెన విరిగింది. ఈ ప్రమాదంలో బాలుడు కిందికి జారిపడగా గమనించిన బంధువులు హుటాహుటిన 108 ద్వారా ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News