Friday, December 27, 2024

కళ్లకు గంతలు కట్టుకుని.. భవనంపై నుంచి పడి బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భవనంపై నుంచి పడి 13 ఏళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన సూరారంలోని రాజీవ్ గృహకల్పలో శుక్రవారం చోటుచేసుకుంది. గృహకల్పలో భవనంలో నివాసం ఉంటున్న తులసీనాథ్ చారి (13) స్థానికంగా ఉన్న తన స్నేహితుడి వద్దకు వెళ్లాడు. పిల్లలు దాగుడుమూతలు ఆడాలని నిర్ణయించుకున్నారు. కళ్లకు గంతలు కట్టుకున్న చారీ ఇతరులను వెతుక్కుంటూ, బ్యాలెన్స్ తప్పి బాల్కనీ నుండి జారిపడిపోయాడు. బాల్కనీకి ప్రహరీ గోడ లేకపోవడంతో బాలుడు ఎత్తు నుంచి కిందపడిపోవడంతో విషాదం నెలకొంది. ఈ ఘటనను గమనించిన స్థానికులు బాలుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై ప్రస్తుతం సూరారం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News