Sunday, December 22, 2024

సంపులో పడి బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

Boy died after falling into water tank

మనతెలంగాణ, హైదరాబాద్ :  అపార్ట్‌మెంట్ సంపులో పడి బాలుడు మృతిచెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం, పడమటి కేశవపూర్ గ్రామానికి చెందిన బిక్షపతి ఎఎస్‌రావు నగర్, మహేష్‌నగర్‌లోని గాయత్రి అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. బిక్షపతికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు యశ్వంత్(6) ఆడుకుంటూ వెళ్లి సంపులో ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. బాలుడు కన్పించకపోవడంతో తండ్రి బిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఫిర్యాదు తీసుకుని వచ్చి అపార్ట్‌మెంట్‌లోని సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించగా ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు సంపులో పడినట్లు తెలిసింది. వెంటనే బాలుడిని బయటికి తీయగా అప్పటికే మృతిచెందాడు. వెంటనే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కుషాయిగూడ ఇన్స్‌స్పెక్టర్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News