Thursday, December 26, 2024

గేట్ మీద పడి బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

పాఠశాల ముందు ఉన్న గేట్ ఎక్కి పిల్లలు ఆడుతుండగా గేట్ విరిగి బాలుడిపై పడడంతో బాలుడు మృతి చెందిన సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హయత్‌నగర్ ముదిరాజ్ కాలనీలో నివాసం ఉండే అలకంటి చందు, కుమారుడు అజయ్ (6) 1వ తరగతి హయత్‌నగర్ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో చదువుతున్నాడు. ఇదిలావుండగా సోమవారం సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్ళే క్రమంలో ముందు ఉన్న గేట్‌పై ఎక్కి ఆడుతుండగా వెల్డింగ్ జాయింట్లు బలహీనంగా ఉండడంతో అజయ్ మీద పడింది. తలకు బలమైన గాయం అవ్వడంతో అక్కడికక్కేడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News