Wednesday, January 22, 2025

బోన్ క్యాన్సర్‌తో మృతి చెందిన మిత్రునికి కొవ్వొత్తులతో నివాళి

- Advertisement -
- Advertisement -

ముస్తాబాద్: మండల కేంద్రంలో నీలం శ్రీరాం అనే యువకుడు ఇటీవల బోన్ క్యాన్సర్‌తో మృతి చెందగా అతని ఆత్మకు శాంతి చూకూరాలని మృతుని పదవతరగతి తోటి మిత్రులు అందరూ కలిసి కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారి మిత్ర బృందం సభ్యులు మాట్లాడుతూ.. నీలం శ్రీరాం తమకు చిన్ననాటి మిత్రుడని, తమతో ఎంతో ఆప్యాయతగా కలిసిమెలిసి ఉండేవాడని అన్నారు.

మృతుని తల్లిదండ్రులు ఆసుపత్రిలో 30లక్షలు ఖర్చుపెట్టినా కూడా ప్రాణాలు కాపాడుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తోటి మిత్రులు జల రాజు, జంగం ప్రణయ్, గనగమాద్రి ప్రణయ్, వొల్లెపు పవన్, తేజ, బోడ రోహిత్ సించు వినయ్ మధు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News