Saturday, March 29, 2025

ఉపాధి హామీ శిలాఫలకం పడి బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

అధికారుల నిర్లక్షంతో ఉపాధి హామీ పనులకు సంబంధించిన (దిమ్మె) పడటంతో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా, కుల్కచర్ల మండల పరిధిలోని అల్లాపూర్ సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విస్లావత్ లక్ష్మణ్, కోమల్ దంపతుల కొడుకు విస్లావత్ సాయి (4) రోజులాగే సోమవారం ఉదయం అంగన్వాడీ కేంద్రాకి వెళ్లాడు. అక్కడ ఉన్న ఉపాధి హామీ పనులకు సంబంధించిన (దిమ్మె) పక్కన బాలుడు ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా దిమ్మె పడటంతో త్రీవ గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే కుమారుడిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. దిమ్మె ప్రమాదకరంగా ఉందని గతంలోనే పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పంటించుకోలేదని వారు వాపోయారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News