Sunday, December 22, 2024

ట్రాక్టర్ బోల్తాపడి బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: ట్రాక్టర్ బోల్తాపడి కుటుంబ సభ్యులకు తీవ్రగాయాలు కాగా, బాలుడు మృతి చెందిన సంఘటన హుజూర్‌నగర్ మండలంలోని వేపలసింగారంలో శుక్రవారం జరిగింది. పట్టణ ఎస్‌ఐ కట్టా. వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వేపలసింగారం గ్రామానికి చెందిన షేక్. నాగుల్ మీరా తన వ్యవసాయ భూమిని దున్నేందుకు తన స్వంత ట్రాక్టర్‌పై తండ్రి హుస్సేన్, భార్య అమీన, కుమారులు అంజద్, తన్వీర్‌లతో కలిసి వెళుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో పెద్ద కుమారుడు అంజద్(7) అక్కడిక్కక్కడే మృతిచెందడం జరిగిందని తెలిపారు.

అలాగే నాగుల్ మీరా, తండ్రి హుస్సేన్, భార్య అమీనలకు తీవ్రగాయాలు కావడంతో హుజూర్‌నగర్ ప్ర భుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్ళగా, అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్సను అందించేందుకు సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారని ఎస్‌ఐ చెప్పారు. మృతుని బాబాయ్ షేక్. ఫరీద్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News