Friday, December 20, 2024

కరెంట్ షాకుతో బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

బిక్కనూర్ : విద్యుత్ షాక్ తగిలి శ్రీతిక్ అనే పంతొమ్మిది నెలల బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి అంతంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం … బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన బండి ప్రవీణ్ రమ్య దంపతుల కుమారుడు శ్రీతిక్ ను తీసుకుని రమ్య ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అమ్మగారి ఇంటికి వెళ్లింది. సోమవారం రాత్రి బాలుని ఎత్తుకుని ఇంటి ముందర ఉన్న దండెంపై ఆరబెట్టిన బట్టలు తీసుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయారు.

తల్లి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడగా బాలుడికి నోటిమాట రాకపోవడంతో వెంటనే కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు బాలుడిని పరిశీలించి మృతి చెందినట్లుగా నిర్ధ్ధారించారు. దీంతో కుటుబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. బాలుడి మృతితో గ్రామంలో విశాదచాయలు అలుముకున్నాయి. ఈ మేరకు కుటుంబ సభ్యులు పోలీసులకు ఘటనా స్థలానికి చేరకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News