Sunday, December 22, 2024

పిడుగుపాటుకు బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: పిడుగు పడి బాలుడు మృతి చెందిన సంఘటన మాడుగులపల్లి మండలంలోని పాములపాడు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కొనుకుంట్ల లింగయ్యయాదవ్ లక్ష్మి దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.

సంవత్సరం క్రితం కునుకుంట్ల లింగయ్య యాదవ్ బైక్ పైనుంచి ప్రమాదవశాత్తు కి ంద పడడంతో కాలు విరగి ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ దంపతులకు గొర్రెలు ఉండడంతో లింగయ్య కుమారుడు కునుకుంట్ల గోపి (19) మంగళవారం గొర్రెలను మేపేందుకు తీసుకెళ్లాగ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మండల వ్యాప్తంగా భారీ ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో గొర్రెలను మేపుతున్న గోపిపై పిడుగు పడి మృతి చెందాడు.

అదేవిధంగా మాడుగులపల్లి మండల కేంద్రంలో సెవెంత్ డే స్కూల్ పక్కన కట్ట రవీందర్ రెడ్డి బావి దగ్గర ఉన్న మూడు తాటి చెట్ల మీద కూడా పిడుగు పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News