Monday, December 23, 2024

లే అన్నా ఆడుకుందాం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తనతో రోజు ఆడుకూనే అన్న ఇక లేడని తెలియని తమ్ముడు  మృతదేహం వద్దకి వెళ్లి లే అన్నా.. ఆడుకుందాం అంటూ అడిగిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానికుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ శివారు జమాండ్లపల్లి సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న బాలుడు ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.

స్థానికులు వెంటనే బాలుడుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అన్నను చూడాలంటూ తమ్ముడు ఏడుస్తుండగా బాలడుడి మృతదేహం వద్దకు తమ్మడుని తీసుకెళ్లారు బంధువులు.స్ట్రెచర్ పై ఉన్న అన్న చేతిని పట్టుకొని అన్నా..లే..అన్నా మనం ఆడుకుందాం అని పిలిచాడు. దీంతో అక్కడ ఉన్నవారు అన్న నిద్ర పోతున్నాడంటూ తమ్ముడుని సముదాయించడం అందరినీ కలిచివేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News