Tuesday, December 3, 2024

పాముకాటుతో బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

పాముకాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని రాఘవపూర్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన తుమ్మల శ్రీనివాస్ కుమారుడు మనీశ్వర్ (8) గ్రామంలోని పాఠశాలలో ఫస్ట్ క్లాస్ చదువుకుంటుండగా, పాఠశాలకు దసరా సెలవులు రావడంతో ఇంటి వద్ద తల్లితో ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం బీడీలను మునీంకు ఇచ్చేందుకు తల్లితో వెంట వెళ్లిన అతను బీడీలు కార్ఖానా సమీపంలోని అట్టలతో ఆడుతుండగా అ తడిని పాము కాటు వేసింది.

కాగా కాటు వేసిన విషయాన్ని అతడు గమనించకపోవడం, తల్లికి ఏదో పురుగు కరిచిందని చెప్పడంతో ఆమె పట్టించుకోలే దు. కొద్దిసేపు తర్వా త అతడు నురగలు కక్కుతూ ఇంట్లో పడిపోవడంతో గమనించిన గ్రామస్తు లు, ఆట్టలను తీసి చూడగా అక్కడ రెండు పాములు కనిపించడంతో, వాటిని చంపి, బాలుడిని హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించినప్పటికీ అప్పటికే బాలుడు చనిపోయాడు. బాలుడు తల్లి లక్ష్మీఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసుకొని రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News