Monday, January 20, 2025

సరదా ఆట..బాలుడి ప్రాణం తీసింది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ బాలుడు తోటి పిల్లలతో ఆడుకుంటుండగా విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన సంఘటన కనిగిరి పట్టణంలోని బొగ్గుల గొంది కాలనీ లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కనిగిరి పట్టణంలోని జవహర్ నగర లో కొలిపాకుల ధనుంజయ్ , శ్వేత దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా చిన్న కూమారుడు ధీరజ్ స్నేహితులతో కలిసి స్థానికంగా క్రికెట్ ఆడటం కోసం వెళ్లాడు.

Also Read: తిరుమలలో మద్యం కలకలం..

క్రికెట్ ఆడిన తర్వాత ఇంటికి వెలుతున్న క్రమంతో స్నేహితుడి ఇంటి వద్ద ఉన్న కుళాయి వద్ద మొఖం కడుక్కొని,ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ సరదగా ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో కుళాయి పైపులోని నీళ్లు స్థానికంగా ఉండే ఇనుప రాడ్డుపై పడడంతో బాలుడికి విద్యుత్ షాక్ కొట్టింది. దీంతో స్థానికులు బాలుడుని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News