Monday, December 23, 2024

బావిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

వేసవి సెలవులు కావడంతో బావిలోకి ఈతకు వెళ్లిన బాలుడు మృతి చెందిన సంఘటన తిర్మలగిరి మున్సిపాలిటి కేంద్రంలో చోటు చేసుకుంది . ఎస్‌ఐ. సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం శనివారం తోటి స్నేహితులతో తిర్మలగిరి మున్సిపాలిటి కేంద్రంలో తిరుమలహిల్స్ కు చెందిన చెన్నూరు వెంకటేష్ కుమార్ చెన్నూరు శ్రీకాంత్ (13 ) సంవత్సరాలు ఈతకు అని వెళ్లి బావిలో ఒక్కసారిగా దూకడంతో ఊపిరి ఆడక మునిగిపోయి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్నా స్థానికులు పోలీసులకు సమాచారం తెలపడంతో సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు ఈతగాళ్లతో వెతకగా బాలుడి ఆచూకి తెలియలేదు. దీంతో పోలీసులు ఫైర్ సిబ్బందిని పిలిపించి ఫైర్‌ఇంజన్‌ ద్వారా సాయంత్రం నుండి నీరు బయటకు తీయగా ఆదివారం ఉదయం ఆరుగంటలకి బాలుడు శ్రీకాంత్ మృతదేహం లభ్యమయ్యింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ, ఏఎస్‌ఐ నికోలస్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News