- Advertisement -
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లో సంక్రాంతి పండగ వేళ విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటిపై పతంగులు ఎగిరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్ కొట్టడంతో 11ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -