- Advertisement -
ఫోన్ మాట్లాడుతూ కరెంట్ తీగ పట్టుకుని ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం మక్కపల్లిలో చోటుచేసుకుంది. కిరణ్(14) అనే బాలుడు ఇంటిపై ఫోన్ మాట్లాడుతూ.. కరెంట్ తీగ పట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో సంఘటనాస్థలంలోనే బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన బాలుడి కటుంబంతోపాటు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
- Advertisement -