Monday, December 23, 2024

బోరుబావిలో పడిన బాలుడు క్షేమం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడు క్షేమంగా బయటకు తీసిన సంఘటన కర్నాటకలో బీజాపూర్ జిల్లాలో జరిగింది. 18 గంటల పాటు శ్రమించి బాలుడిని సహాయ సిబ్బంది రక్షించారు. లచాయన గ్రామాని చెందిన సతీశ్ తన ఇంటికి సమీపంలో బోరుబావిని తవ్వించాడు. బుధవారం రెండేళ్ల కుమారుడు సాత్విక్ పొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడ్డాడు. బాలుడు కనిపించకపోవడంతో బోరు బావిలో నుంచి శబ్ధాలు రావడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు అక్కడికి చేరుకొని బాలుడు 16 అడుగుల లోతులో చిక్కుకున్నట్టు గుర్తించారు. పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకొని జెసిబి సహాయంతో 18 గంటల పాటు శ్రమించి బాలుడిని బయటకు తీశారు. వెంటనే బాలుడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News