Monday, December 23, 2024

ప్రియురాలిని 35 ముక్కలుగా నరికి… ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో పడేసి

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: ప్రేమించుకున్నారు… పెద్దలు అడ్డుచెప్పడంతో ముంబయి నుంచి ఢిల్లీకి పారిపోయి ఆ జంట సహజీవనం చేస్తుంది. పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు బలవంతం చేయడంతో ఆమెను ప్రియుడు 35 ముక్కలుగా నరికి ఢిల్లీలోని పలు ప్రాంతాలలో శరీర భాగాలను విసిరేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముంబయిలో ఓ కాల్ సెంటర్ శ్రద్ధా (26) అనే యువతి పని చేస్తుండగా అఫ్తాబ్ అమీన్ పునావాలాతో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పడంతో ముంబయి నుంచి ఢిల్లీకి పారిపోయారు.

ఢిల్లీలోని మెహ్రాలీ ప్రాంతం ఓ ప్లాట్‌లో ఉంటున్నారు. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధా బలవంతం చేయడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఆమెను అమీన్ చంపేశాడు. శరీర భాగాలను 35 ముక్కలుగా నరికి 18 రోజుల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. మృతదేహం ఆనవాళ్లు లేకుండా చేసేందుకు రాత్రి సమయంలో శరీర భాగాలను ఢిల్లీలో వివిధ ప్రాంతాలలో విసిరేశాడు. శ్రద్ధా పోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తండ్రికి అనుమానం వచ్చి వారు ఉన్న ప్రాంతానికి వచ్చాడు. ఇంటికి తాళం వేసి ఉండడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి అమీన్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతోనే ఈ దారుణానికి పాల్పడ్డానని వివరించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News