Tuesday, December 24, 2024

నాల్గో అంతస్తు నుంచి కిందపడిన ఎయిర్ హోస్టెస్… ప్రియుడే తోసేసి?

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: మహిళా ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య చేసుకోలేదని, ప్రియుడు ఆమెను హత్య చేశాడని ఆమె ఎయిర్ హోస్టెస్ తల్లి ఆరోపణలు చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని కోరమంగళా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. అర్చనా ధిమాన్ అనే ఎయిర్ హోస్టెస్ తన బాయ్ ఫ్రెండ్ అదేశ్‌ను కలవడానికి దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చింది. కేరళకు చెందిన అదేశ్ సాఫ్ట్‌వేర్ జాబ్ నిమిత్తం బెంగళూరులో ఉంటున్నాడు. కోరమంగళ ప్రాంతంలోని రెణుకా రెసిడెన్సియల్ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు కలుసుకున్నారు. అర్చనా నాలుగో అంతస్తు నుంచి కిందపడిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్చనా తల్లి మాత్రం ఆమె ప్రియుడు అదేశ్ నాలుగో అంతస్థ నుంచి తన కూతురిని తోసేశాడని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్చనా మాత్రం ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్ట్ గా పని చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News