Thursday, January 23, 2025

పోస్టుమాస్టర్‌ను ప్రియుడు చంపి… తల్లికి లోకేషన్ షేర్ చేశాడు…

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో మహిళా పోస్టుమాస్టర్‌ను ప్రియుడు హత్య చేసిన సంఘటన ఒడిశా రాష్ట్రం సుందర్‌గఢ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పోస్టుమాస్టర్ స్నిగ్ధ, ప్రధాన్, నయన్ అనే యువతి యువకుడు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. స్నిగ్ధకు కాల్ చేసి ఓ స్థలానికి రమ్మని నయన్ కబురు పంపాడు. ఇద్దరు మధ్య గొడవ జరగడంతో ప్రియురాలిని ప్రియుడు కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ఆమె తల్లికి లోకేషన్ షేర్ చేసి మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించాడు.

Also Read: ప్రియుడ్ని పాముకాటుతో చంపిన ప్రియురాలు

సోమవారం తన కూతురు కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో స్నిగ్ధ తల్లి ఫిర్యాదు చేసింది. అదే రోజు తనకు సందేశం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు మృతదేహం వద్దకు చేరుకొని స్వాధీనం చేసుకున్నారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడు నయన్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఆమె పని చేసే చోట సహోద్యోగితో ఎక్కువగా మాట్లాడుతుండడంతో అనుమానంతోనే హత్య చేశానని నయన్ చెప్పాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News