ప్రియుడి మోజులో కన్న కొడుకు
హత్య కొడుకును దారుణంగా
చంపించి కట్టుకథ
మనతెలంగాణ/హైదరాబాద్/ముషీరాబాద్: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ వివాహిత మహిళ తన మూడేళ్ల కుమారుడిని ప్రియుడి తో చిత్ర హింసలకు గురిచేయించి చివరకు చం పించిన ఘటన నగరంలోని ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. కన్న కొడుకును చం పించిన తల్లి తన కుమారుడు కుర్చీ మీద నుంచి కింద పడి మరణించాడని కట్టుకథ అల్లినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన పొనగంటి శివకుమార్, నాగలక్ష్మి దంపతులు న గరంలోని ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ని రాంనగర్ మోహన్ నగర్ కమ్యూనిటీ హాల్ స మీపంలో నివసిస్తున్నారు.
వృత్తి రీత్యా పెయింటర్ అయిన శివకుమార్‌కు భార్య నాగలక్ష్మీ దంపతులకు పవన్ కుమార్, భరత్ కమార్ అనే ఇద్దరు పి ల్లలున్నారు. ఈక్రమంలో నాగలక్ష్మి వారి దూ ర పు బంధువైన ముస్తాల రవితో అక్రమ సంబం ధం కొనసాగిస్తూ వస్తోంది. శివకుమార్ ఇంట్లో లేని సమయంలో తరచూ నాగలక్ష్మి ఇంటికి వచ్చే రవి ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు భరత్‌కుమార్ ను అంగన్‌వాడీకి తీసుకెళ్లి, ఆ తర్వాత 2 గంటల కు తిరిగి ఇంటికి తీసుకొచ్చేవాడు. జూలై 8వ తేదీ న పొనగంటి శివకుమార్, అతని భార్య నాగలక్ష్మీలు పని కోసం హైటెక్ సిటీకి వెళ్లారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు భరత్‌కుమార్‌ను ఇంటికి తీసుకురావాలని ముస్తాల రవికి, నాగలక్ష్మీ ఫోన్ చేసి చెప్పింది. దీంతో భరత్ కుమార్‌ను అంగన్‌వాడీ నుంచి రవి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే భరత్ కుమార్ ఆడుకుంటూ కుర్చీలో నుంచి కిందపడి దెబ్బ తగలడంతో రక్తం వస్తోందంటూ నాగలక్ష్మీకి రవి ఫో న్ చేసి చెప్పా డు. దీంతో హైటెక్ సిటీ నుంచి భా ర్యాభర్తలు హు టాహుటీన ఇంటికి చేరుకున్నారు. చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లిన కాసేపటికి బాలుడు మరణించాడు. భరత్‌కుమార్ మృతిలో తనకు అనుమానం ఉందని, ఈ ఘటనపై వి చారణ చేపట్టాలని శివకుమార్ జూలై 8న ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తల్లి సూత్రధారి…ప్రియుడు పాత్రధారి
తన వివాహేతర సంబంధానికి కుమారుడు భరత్‌కుమార్ అడ్డుగా ఉన్నాడని భావించిన నాగలక్ష్మీ బాలుడిని అంతమొందించేందుకు పథకం రచించింది. ఇందులో భాగంగా తన ప్రియుడి రవితో భరత్‌కుమార్‌ను చంపించాలని, ఆ సమయంలో భార్యభర్తలు ఇంట్లో బయట ఉండే విధంగా ప్లాన్ వేశారు. ఈక్రమంలో జూలై 8న ఉద్దేశ్యపూర్వకంగానే శివకుమార్‌ను భార్య నాగలక్ష్మీ పనికోసం అంటూ దూరంగా హైటెక్ సిటీ ఏరియాకి తీసుకెళ్లింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అంగన్‌వాడీ నుంచి భరత్‌ను తీసుకురావాలని ఫోన్ ద్వారా రవికి చెప్పిన నాగలక్ష్మీ తాము అనుకున్నట్టుగా చేయాలని కూడా ఫోన్‌లో సంభాషించినట్టు పోలీసులు గుర్తించారు. భరత్ కుమార్‌ను రవి నా నా రకాలుగా అత్యంత పాశవికంగా చిత్రహింసల కు గురిచేయడమే కాకుండా లైంగికంగా వేధించా డు.
మలద్వారంలో స్టీల్ రోకలి పెట్టి అత్యంత క్రూరంగా వ్యవహరించి చంపేశాడు. ఈ క్రమంలోనే నాగలక్ష్మి చెప్పినట్లు భరత్‌కుమార్ కుర్చీపై నుంచి కిందపడి తలకు గాయాలయ్యాని కట్టుకథ అల్లారు. కన్నకొడుకును దారుణంగా చంపించిన నాగలక్ష్మి తనకేమీ తెలియనట్టుగా నటించడమే కాకుండా, కొడుకు చనిపోయాడని రోధిస్తూ పోలీసుల ఎదుట నటించింది. పోలీసులు నిందితుడు రవిని ప్రశ్నించి కీలక ఆధారాలు సేకరించారు.
విచారణలో అసలు విషయం
శివకుమార్ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టినక్రమంలో కీలక విషయాలువెలుగుచూశాయి. భరత్‌కుమార్ తీవ్ర గాయాల వల్లే మరణించినట్టుగా పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దీంతో ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. శివకుమార్‌కు వరుసకు బావమరిది అయ్యే రవితో మృతుడు తల్లి నాగలక్ష్మీకి వివాహేతర సంబం ధం ఉన్నట్టుగా తేలింది. రవి ఇప్పటికే రెండు పెళ్లి ళ్లు చేసుకుని భార్యలకు దూ రంగా ఉం టూ ఏడా ది కాలంగా నాగలక్ష్మీతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు విచారణలో వెలుగుచూసింది. శివకుమార్ పెయింటింగ్ వర్క్ నిమి త్తం బయటకు వెళ్లినప్పుడల్లా నాగలక్ష్మీ ఇంటికి రవి వచ్చి వెళ్లేవాడని, వీరి మధ్యనున్న వివాహేతర సంబంధానికి భరత్‌కుమార్ అడ్డుగా ఉండటం బాలుడికి దారుణంగా చంపినట్లు విచారణలో వెల్లడైంది.