ఐదేళ్ల బాలుడు ఓ అపార్ట్‌మెంట్ లిఫ్టులో సుమారు మూడు గంటలపాటు చిక్కిపోయి నరకయాతన అనుభవించిన ఘటన నాంపల్లిలో శుక్రవారం జరిగింది. నాంపల్లి పీఎస్ పరిధిలో శాంతినగర్ మాఫర్ కంపరెక్ట్ అపార్ట్‌మెంట్‌లో జరిగింది. పోలీసులు, ప్రత్యక్షుల కథనం…. మధ్యాహ్నాం రెండుగంటల వేళలో ఆపార్ట్‌మెంట్ మూడోఅంతస్థుల్లో తాతతో కలిసి బాలుడి లిఫ్టులోకి ఎక్కాడు. బాలుడు, తాత లిఫ్టు బయట ఉన్నారు. బాలుడు హడావిడిగా లిఫ్ట్ బటన్ ప్రెస్ చేయగా పైకి వెళ్లింది. వెంటనే కరెంట్ సరఫరా స్తంభించింది. ఈ హడావిడి క్రమంలో అతను బయటికి వచ్చేందుకు యత్నించే తొందరలోనే కడుపు బయటపెట్టాడు. వెంటనే లిఫ్టు అగి అందులోనే చిక్కిపోయాడు. ఈ విషయం మధ్యాహ్నం 2.15 గంటలకు నాంపల్లి పోలీసులకు సమాచారం అందిన వెంటనే ఇన్‌స్పెక్టర్ అప్పలా నాయుడు తన బృందంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని వెంటనే నిలోఫర్ ఆస్పత్రి వైద్యులను రప్పించా డు.
ఈ విషయం తెలియగానే డీఆర్‌ఎఫ్ బృందం చేరుకున్నది. బాలుడు లిఫ్టులో ఇరుక్కుపోయిన బాలుడు కాపాడంటూ కుటుంబసభ్యులతో వేడుకున్నాడు. వారు వెంటనే రంగంలోకి దిగి బాలుడి ప్రాణానికి ఎలాంటి హానీ కల్గించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. లిఫ్టు గోడ, గ్రిల్‌ను గ్యాస్ కట్టర్‌తో విరగొట్టాడు. ఇలా సుమారు మూడు గంటలపాటు శ్రమించి లిఫ్టులోంచి బాలుడిని క్షేమంగా, సురక్షితంగా బయటికి తీసుకురావడంతో అందరూ హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. బాలుడ్ని అంబులెన్స్ ద్వారా నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకొచ్చారు. అక్కడే తొలుత శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నాడు. నాంపల్లి శాసససభ్యుడు మాజీద్ హుస్సేన్ సందర్శించి బాలుడి పరిస్థితి గురించి వాకబు చేశారు. ఆస్పత్రిలో బాలుడికి రక్త స్రావం అయినట్లు, శ్వాస సమస్యను తొలుత వైద్యులు గుర్తించారు.
బాలుడి పరిస్థితి విషమంగా ఉంది
నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రవికుమార్
బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.. కడుపు భాగం లిఫ్టు గ్రిల్స్‌కు, గోడకు మధ్య నలిగిపోవడంతో లోపల అంతర్గతంగా డ్యామేజ్ అయింది, మెదడుకి ఎక్కువ సేపు అక్సిజన్ అందకపోవడంతో మిగతా అవయవాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో బాలుడికి ఫిట్స్ వచ్చాయి. బాబుకి సర్జరీ చేశాం.. ప్రస్తుతం ఎమర్జెన్సీ ఐసీయులో వెంటిలేటర్‌పై వైద్యుల బృందం బతికించేందుకు తీవ్ర యత్నాలు చేస్తున్నామని నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆచార్య రవికుమార్ వివరించారు. అపార్ట్‌మెంట్ మొదటి, రెండో అంతస్థుల మధ్య బాలుడు ఇరుక్కుపోయి నానా యాతనకు గురయ్యాడని సైఫాబాద్ ఎసీపీ సంజయ్‌కుమార్ తెలిపారు.