- Advertisement -
దర్శనం క్యూలైన్ గ్రిల్స్‌లో బాలుడి తల ఇరుక్కుపోయిన ఘటన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం చోటుచేసుకుంది. వారి దర్శనార్ధం హైదరాబాద్‌లోని బోడుప్పల్‌కు చెందిన భక్తులు కుటుంబంతో పాటు యాదగిరిగుట్టకు వచ్చారు. స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూలైన్‌లో వేచిఉండగా దయాకర్ అనే బాలుడు ఆడుకుంటుండగా గ్రిల్స్ మధ్యలో తల ఇరుక్కుపోయింది. వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బాలుడి తలను బయటకు తీశారు. బాలుడు సురక్షితంగా బయటకు రావడంతో కుటుంబ సభ్యులు, ఆలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -