Saturday, November 23, 2024

వైఎస్‌ఆర్‌ పథకంతో బాలుడి గుండె మార్పిడి చికిత్స విజయవంతం

- Advertisement -
- Advertisement -

అనంతపూర్‌: రెండు నెలలుగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న 14 సంవత్సరాల బాలుడు మాస్టర్‌ అనిల్‌ కుమార్‌ చివరకు తన పోరాటంలో విజయం సాధించి, సంతోషంతో చిరునవ్వు చిందించాడు. బెంగళూరులోని రామయ్య నారాయణ హార్ట్‌ సెంటర్‌ లో అతనికి గుండె మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. మాస్టర్‌ అనిల్‌ కుమార్‌కు తీవ్రమైన ఈఎఫ్‌ (ఎజెక్షన్‌ ఫ్రాక్షన్‌)తో ఎడమ వైపు జఠిరిక పనిచేయకపోవడంతో డైలేటెడ్ కార్డియోమయోపతి సమస్య అతని ఉత్పన్నమైంది. ఇది 20–25%గా ఉంది. ఈ గుండె మార్పిడి శస్త్రచికిత్సను వైఎస్‌ఆర్‌ పథకం కింద విజయవంతంగా నిర్వహించారు. రామయ్య నారాయణ హార్ట్‌ సెంటర్‌ వద్ద విజయవంతంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న 42వ రోగి మాస్టర్‌ అనిల్‌ కుమార్‌.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా దిమ్మగుడి నుంచి వచ్చిన మాస్టర్‌ అనిల్‌ కుమార్‌, గత 3–4 నెలలుగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు. అతని కుటుంబం స్థానిక హాస్పిటల్‌లో చికిత్స నందించినప్పటికీ అతని గుండె పరిస్ధితి ఏ మాత్రం మెరుగుపడలేదు. సరికదా అతని పరిస్థితి మరింతగా దిగజారింది. చివరకు అతని పరిస్ధితి ఎంతగా దిగజారిందంటే, అతను నడవలేడు, కనీసం మంచంపై వెల్లకిలా పడుకోనూలేడన్నట్లుగా మారింది. శ్వాస సమస్యలను అధిగమించేందుకు అతను కూర్చునే ఉండాల్సిన స్ధితి వచ్చింది.

నాణ్యమైన చికిత్స కోసం అతని కుటుంబం వెదుకుతుండగా, రామయ్య నారాయణ హార్ట్‌ సెంటర్‌ కనబడింది. మాస్టర్‌ అనిల్‌ కుమార్‌ ను అతని సొంత పట్టణం నుంచి డాక్టర్‌ నాగమల్లేష్‌ యుఎం నేతృత్వంలో తరలించారు. హాస్పిటల్‌లోని బృందం అతని పరిస్థితిని సమీక్షించారు. రోగి పరిస్ధితి కేవలం గుండెమార్పిడి తో మాత్రమే మెరుగుపడుతుందని నిర్ధారించారు. జీవసార్థకత వద్దగుండె మార్పిడి కోసం నమోదు చేసుకోవాల్సిందిగా సలహా ఇవ్వడం జరిగింది. అనిల్‌ కుమార్‌కు సరిపడా గుండె 46 రోజులలో లభించింది.

అనిల్‌కుమార్‌కు ప్రాణదాతగా 26 సంవత్సరాల యువకుడు నిలిచాడు. బెంగళూరుకు చెందిన ఈ యువకుడు యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడటంతో బ్రెయిన్‌డెడ్‌గా డిక్లేర్‌ చేశారు. అతని కుటుంబ సభ్యులు అవయవదానం కోసం సమ్మతించారు. రామయ్య నారాయణ హార్ట్‌ సెంటర్‌ వద్ద మాస్టర్‌ అనిల్‌కు గుండె మార్పిడి జరిగింది. ఈ శస్త్ర చికిత్సలో ట్రాన్స్‌ప్లాంట్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ నాగమల్లేష్‌, కార్డియోథొరాకిక్‌ సర్జన్‌, డాక్టర్‌ రవిశంకర్‌ శెట్టి, డాక్టర్‌ గోవర్థన్‌, డాక్టర్‌ ప్రశాంత్‌ రామమూర్తితో పాటుగా కార్డియాక్‌ అనస్తీషియాలజిస్ట్‌ డాక్టర్‌ గురు పోలీస్‌ పాటిల్ పాల్గొన్నారు. ఈ గుండె మార్పిడి విజయవంతం కావడంతో పాటుగా శస్త్రచికిత్స తరువాత రోగి వేగంగా కోలుకున్నాడు.

ఈ కేసు గురించి డాక్టర్‌ నాగమల్లేష్‌ యుఎం, హార్ట్‌ ఫెయిల్యూర్‌ కన్సల్టెంట్‌ అండ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ కార్డియాలజిస్ట్‌, రామయ్య నారాయణ హార్ట్‌ సెంటర్‌ మాట్లాడుతూ.. ‘‘తీవ్రమైన ఎడమ జఠిరిక పనిచేయకపోవడంతో డైలేటెడ్ కార్డియోమయోపతి అనేది మరణాలకు అతి పెద్ద కారణంగా నిలుస్తుంది. ఈ తరహా స్థితికి గుండె మార్పిడి ఒక్కటే పరిష్కారం. మరీ ముఖ్యంగా మాస్టర్‌ అనిల్‌ కుమార్‌ లాంటి రోగులకు’’ అని అన్నారు. ఈ గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం కావడంతో పాటుగా ఈ రోగిని వార్డుకు తరలించారు. అక్కడ అతను చక్కగా కోలుకుంటున్నాడు. తమ సంతోషాన్ని మాస్టర్‌ అనిల్‌ కుమార్‌ తండ్రి వెల్లడిస్తూ..‘‘రామయ్య నారాయణ హార్ట్‌ సెంటర్‌ వద్ద డాక్టర్‌లను కలుసుకోనంత వరకూ మాకు ఆశ లేదు. ఈ టీమ్‌ మా అబ్బాయిని బ్రతికించడం మాత్రమే కాదు అతను తిరిగి ఆరోగ్యం పొందేందుకు సైతం సహాయపడ్డారు. వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని అన్నారు.

boy heart surgery success at Ramaiah Narayana Centre in Bangalore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News