తీర్పు చెప్పిన కోర్టు
హైదరాబాద్: బాలికపై అఘాయిత్యం చేసిన బాలుడికి రెండేళ్ల జైలు, రూ.10,000 జరిమానా విధిస్తూ జూవైనల్ కోర్టు తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని శివరాంపల్లికి చెందిన నామాల బాబు అలియాస్ వినయ్(18) బాలికపై అత్యాచారం చేశాడు. హిమాయత్‌నగర్‌కు చెందిన బాలిక(17) స్థానికంగా ఉన్న గిఫ్ట్ షాపులో పనిచేస్తోంది. అక్కడే పరిచయమైన నామాల బాబు, బాలికను డిసెంబర్ 26,2020న బయటికి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడు. ఇంటి నుంచి పనికి వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకీ కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తు చేసిన పోలీసులు కోర్టులో ఛార్జిషీట్ వేశారు, సాక్షాలను పరిశీలించిన కోర్టు నిందితుడికి రెండేళ్ల జైలు, పదివేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. నిందితుడికి శిక్షపడేలా చేసిన పోలీసులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అభినందించారు.