Sunday, January 19, 2025

కుక్కల దాడిలో బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మియాపూర్: వీధి కుక్కల దాడిలో ఆరేళ్ల బాలు డు మృతి చెందిన సంఘటన మి యాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తె లిపిన వివరాల ప్రకారం… బొసళ్ల సాత్విక్ (6) మియాపూర్‌లోని మ క్తా మ హబూబ్‌పేట్‌లో తండ్రి, నా నమ్మతో కలిసి ఉంటున్నాడు. వీరి కుటుంబం ధర్మపురి ఆలయంలో వద్ద బిక్షాటన చేసుకుం టూ జీవనం సాగిస్తున్నారు. సాత్విక్ మక్తా గ్రామంలో ప్రైమరీ పాఠశాలలో చదువుతున్నాడు. స్థానికంగా ఉన్న డంపింగ్ యార్డ్ వద్ద సాత్విక్ రోజు వీధి కుక్కలతో ఆడుకునేవాడు.

రోజు మాదిరిగా మంగళవారం కూడా డంపింగ్ యార్డ్ వద్ద ఆడుకోవడానికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు బుధవారం ఉదయం డంపింగ్ యార్డ్ వద్దకు వెళ్లి చూడగా ఒంటిపై గాయాలతో బాలుడు మృతి చెంది ఉన్నాడు. స్థానికులు వెంటనే పోలీసులకు స మాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా కు క్కల దాడిలోనే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News