Saturday, January 25, 2025

బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్.. బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం తారమతి బరాదారి వేగంగా దూసుకొచ్చిన ఓ టిప్పర్ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్నవారిలో ఓ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భార్యభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News