Wednesday, December 18, 2024

ప్రాణం తీసిన దాగుడుమూతలు…

- Advertisement -
- Advertisement -

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. తన స్నేహితులతో దాగుడుమూతలు అడుతుండగా ఓ బాలుడు ఇంట్లో నిల్వ ఉన్న పత్తిలో దాక్కున్నాడు. పత్తికి చిన్న రంధ్రం చేసి, తల లోపలికి పెట్టి దాక్కున్నాడు.

అయితే, తన స్నేహితులకు కనిపించకుండా ఉండేందుకు మరింత లోపలికి చొచ్చుకెళ్లిన బాలుడు, పత్తిలో చిక్కుకుని, ఊపిరాడక మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News