Monday, January 20, 2025

ఆన్‌లైన్ గేమ్ లో మునిగిపోయిన యువకుడు.. రూ.95 లక్షలు స్వాహా

- Advertisement -
- Advertisement -

పెరిగిన టెక్నాలజీని వినియోగించుకుని అనేక మంది సైబర్ నేరగాళ్లు ప్రజలను దోచుకుంటున్నారు. తాజాగా ఆన్‌లైన్ కింగ్ 527 గేమ్ అడి రూ.95లక్షలు పోగొట్టుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన చన్‌వల్లి హర్షవర్ధన్‌రెడ్డి.. కింగ్ 527 అనే ఆన్‌లైన్ గేమ్ డౌన్లోడ్ చేసుకుని గేమ్ అడడంతో అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం రూ.95లక్షలు పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ సైబర్ క్రైమ్ గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సీతారాంపూర్ గ్రామానికి చెందిన చన్‌వల్లి శ్రీనివాస్‌రెడ్డి, విజయలక్ష్మీ దంపతుల కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి నగరంలోని నిజాం కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. గ్రామంలో ఉన్న 10 ఎకరాల దేవాదాయశాఖ భూమిని ప్రభుత్వం తీసుకుని ఎకరాకు రూ.10లక్షల చోప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించింది. వచ్చిన డబ్బులతో మల్లాపూర్ వద్ద భూమి కొనేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు.అయితే, వారు తమ అకౌంట్‌లో ఉన్న డబ్బులను కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి అకౌంట్‌లోకి ట్రాన్స్‌ర్ చేశారు. అదే సమయంలో కింగ్ 527 అనే ఆన్‌లైన్ గేమ్ ను డౌన్ లోడ్ చేసుకుని గేమ్ అడిన హర్షవర్దన్ మొత్తం డబ్బులను పోగొట్టుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News