Monday, December 23, 2024

నీటి ప్రవాహంలో పడి బాలుడు గల్లంతు

- Advertisement -
- Advertisement -

నిజాంపేట్ : నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ 22వ డివిజన్ ఎన్‌ఆర్‌ఐ కాలనీ పరిధిలోని ఒక అపార్ట్మెంట్ పక్క నుండి వెళ్లే వరద నీటి కాలువలో ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న డిఆర్‌ఎఫ్ టీం బాలుడి ఆచూకీ కొరకు గాలిస్తున్నారు. సోమవారం నుండి కురుస్తున్న భారీ వర్షం కారణంగా వర్షపునీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో బాలుడి ఆచూకీ కనుగొనడం కష్టం అవుతుందని మున్సియల్ సిబ్బంది తెలిపారు. కొన్ని నిముషాలముందే కళ్ళ ముందు ఉన్న ఉన్న బాలుడు వరద కాలువలో పడి కొట్టుకుపోయాడని సిసి కెమెరాల ద్వారా చూసిన బాలుడు తల్లి, తండ్రులు విలవిలలాడిపోయారు. ముక్కు పచ్చలారని బాలుడు ఇక లేడు అని తెలిసి స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.

తమ కాలనీలో అన్ని వరద కాలువలు ఓపెన్ గా ఉన్నాయని, ఇప్పుడు జరిగిన సంఘటన భవిష్యత్తులో జరగకుండా కాలువపై యుద్ధ ప్రాతిపదికన కాంక్రీట్ వేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. విషయం తీసుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కె. పి. వివేకానంద్ సంఘటన జరిగిన స్థలం నుమేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కమిషనర్ రామకృష్ణ రావు లతో కలిసి పరిశీలించి బాలుడి తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో పిల్లలు బయటికి పోకుండా జాగ్రత్త వహించాలని స్థానికులకు సూచించారు. జరిగిన సంఘటన చాలా బాధాకరం అని భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చర్య తీసుకోవాలని కమిషనర్ ను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News