Wednesday, January 22, 2025

నారాయణగూడ పిఎస్‌లో బాలుడు.. తెలిస్తే ఫోన్ చేయండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ బాలుడి ఆచూకీ తెలిన వారు ఉంటే వెంటనే నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్సై కోరారు. నారాయణ గూడ మెట్రో స్టేషన్‌లో గుర్తుతెలియని బాలుడు ఉన్నట్లు డయల్ 100 ఫోన్ రావడంతో నారాయణగూడ పెట్రోలింగ్ పోలీసులు అక్కడకు వెళ్లారు. వెంటనే బాలుడిని దగ్గరకు తీకుని వివరాలు అడుగగా చెప్పలేకపోయాడు. తల్లిదండ్రులు, తన పేరు, కుటుంబ సభ్యుల వివరాలు చెప్పకపోవడంతో పోలీసులు నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని అడ్మిన్ ఎసై కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News