Saturday, February 22, 2025

విషాదం: లిఫ్ట్‌లో ఇరక్కుపోయిన బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాసబ్‌ట్యాంక్‌ శాంతి నగర్‌లోని మ‌ఫ‌ర్ కంఫ‌ర్ట్ అపార్ట్‌మెంట్‌లో ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయిన బాలుడు అర్ణవ్(6) మృతి చెందినట్లు శనివారం వైద్యులు ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మూడో ఫ్లోర్‌ నించి కిందకు దిగే క్రమంలో ప్రమాదవశాత్తు అర్ణవ్ లిఫ్ట్‌లో చిక్కుకుపోయాడు. అతని అరుపులు విన్న అపార్ట్‌మెంట్ వాసులు అక్కడకు చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఫైర్‌ సిబ్బందిని, హైడ్రా డీఆర్‌ఎఫ్‌ బలగాలను రప్పించారు. సిబ్బంది కట్టర్ల సహాయంతో లిఫ్ట్‌ను కట్ చేసి బాలుడిని బయటకు తీశారు.

వెంటనే బాలుడిని నీలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే బాలుడు పొట్ట, వెన్నుభాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి. అతని కడుపు కూడా పూర్తిగా నలిగిపోవడంతో వైద్యులు లాపరోటమీ సర్జరీ చేసి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో బాలుడు మృతి చెందాడు. పిల్లాడి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాలుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News