Monday, December 23, 2024

నా బిడ్డను ఆదుకోండి..ఓ తల్లి ఆవేదన

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : వారిది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం ..సజావుగా సాగుతున్న వారి జీవితం లో ఒక్కసారిగా అనుకొని సంఘటన చోటు చేసుకుంది. వివరాలోకి వెళితే… సిద్దిపేట పట్టణంలోని 28వ వార్డు ముర్షద్ గడ్డలో నివాసం ఉంటున్న రాజు రాజేశ్వరి దంపతుల కుమారుడు దయాకర్ (14) కు అరుదైన నరాల వ్యాధి క్రోనిక్ ప్రోగ్రెసివ్ సర్వికల్ డిస్టోనియా అండ్ జెనెటిక్ ఏటియాలాజీ సోకింది. దీంతో తల్లిదండ్రులు వారి దగ్గర ఉన్న డబ్బులు దయాకర్ చికిత్సం కోసం ఖర్చు చేశారు. మెరుగైన చికిత్స కోసం రూ. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అవసరం ఉండవచ్చని డాక్టర్లు చెప్పారు.

రెక్కాడితే కాని డొక్కాడని పరిస్ధితుల్లో ఉన్న కుటుంబం కావడంతో తన బిడ్డను ఆదుకోవాలని ఆ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన కనిపించిన వారిని వేడుకుంటున్నారు. దయగల వారు తోచినంత సహాయం అందించి తన బిడ్డను ఆదుకోవాలని , చికిత్స త్వరితగతిన అందించకపోతే బాలుడి ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. సహాయం చేయదలచిన వారు. బాలుడి గురించి ఏదైనా సమాచారం తెలుసుకోవాల్సిన వారు దయాకర్ తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ 9959722581 కు ఫోన్ పే కానీ గూగుల్ పే చేయవచ్చని అలాగే  అకౌంట్ నంబర్ 7311838327 ఎపిజివిబి హైదరాబాద్ రోడ్ బ్రాంచ్, Ifsc కోడ్ :SBINORRAPGB లో గల అకౌంట్ నెంబర్‌కు పంపించవచ్చని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News