Sunday, February 23, 2025

క్యాన్సర్ బాధిత బాలుడికి తక్షణమే వైద్యం అందించాలి: సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

వరంగల్ లో తనను కలవలేక పోయిన క్యాన్సర్ బాధిత బాలుడు మహమ్మద్ అదిల్ అహ్మద్ ఉదంతంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పందించారు. తక్షణమే వైద్య సహాయం అందించాలని సిఎంఓ అధికారులను ఆయన ఆదేశించారు. సిఎం రేవంత్ రెడ్డి సూచనలతో సిఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు బాలుడి కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. నెల రోజుల క్రితం అదిల్ అహ్మద్ చికిత్స కోసం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి లక్ష రూపాయల ఎల్వోసి మంజూరు చేసింది. ప్రస్తుతం అదిల్ అహ్మద్ ఆరోగ్య పరిస్థితిపై వేముల శ్రీనివాసులు ఆరా తీశారు. సిఎంఆర్‌ఎఫ్ ద్వారా కావాల్సిన మరింత సాయం అందిస్తామని ఆయన అదిల్ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News