- Advertisement -
రంగారెడ్డి: శంషాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. శంషాబాద్ లో జరిగిన ఓ పెళ్లికి తన కుమారుడుతో కలిసి నందిగామకు చెందిన దంపతులు హాజరయ్యారు. అయితే, తమ కుమారుడు హఠాత్తుగా చనిపోవడంతో దంపతులు దుఃఖంలో మునిగిపోయారు.
ఫంక్షన్ హాల్ నిర్వహకులపై బాలుడి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -