Friday, December 20, 2024

ఇదేం సాహసం?: మొసళ్ల మధ్యలోకి దూకేశాడు…

- Advertisement -
- Advertisement -

వింటేనే వణుకు పుట్టించే సంఘటన.. ఇక కళ్లారా చూస్తే? అలాంటి సంఘటన తాలూకు వీడియో ఒకటి నెట్ లో వైరల్ గా మారింది. దాన్ని చూసినవాళ్లంతా నోరు వెళ్లబెడుతున్నారు!

ఒక స్విమ్మింగ్ పూల్ లో వందలాది మొసళ్లు ఉన్నాయి. అకస్మాత్తుగా ఆ పూల్ లోకి ఓ పదేళ్ల కుర్రాడు దూకేశాడు.  వెంటనే అతన్ని మొసళ్లు చుట్టుముట్టాయి. ఈ వీడియోను ఇప్పటికే 73వేల మంది చూశారు. చూసినవాళ్లంతా దిగ్భ్రాంతి చెందుతూ పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకూడదని కొందరు సలహా ఇస్తుంటే, మరికొందరు ఆ అబ్బాయిని అలా పెంచినందుకు అతని తల్లిదండ్రలకు చీవాట్లు పెడుతున్నారు. ఇలాంటి ఫీట్లు చాలా ప్రమాదకరమనీ, ఇలాంటి మూర్ఖపు పనులు చేయకూడదని ఇంకొందరు హితవు చెబుతున్నారు. ఈ వీడియోను ఎక్స్ లో షేర్ చేసిన వ్యక్తి “కొన్నిసార్లు మన సమస్యలకు మనమే కారణమవుతాం” అని కామెంట్ చేశాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News