Sunday, December 22, 2024

బ్రిటన్‌రాజుపై గుడ్డు విసిరిన యువకుడు..

- Advertisement -
- Advertisement -

లండన్: బ్రిటన్‌లో ఓ వ్యక్తి కింగ్ ఛార్లెస్‌పై కోడిగుడ్డు విసిరాడు. యార్క్‌షైర్‌కు ఛార్లెస్ దంపతులు వెళ్లినప్పుడు బుధవారం ఈ ఘటన జరిగింది. వెంటనే అక్కడున్న భద్రతా అధికారులు ఈ వ్యక్తిని పట్టుకుని తరలించారు. యార్క్ ప్రాంతంలో ప్రజల ముందుకు రాజరిక కుటుంబం వారు వచ్చి నిలిచే మికెలిగేట్ బార్ వద్ద నిరసనకారుడు తన చేతిలోని గుడ్డును రాజుపైకి విసిరివేస్తూ ఈ దేశం బానిసల రక్తంతో నిర్మితం అయిందని కేకలు పెట్టాడు. ఈ 23 ఏండ్ల వ్యక్తిని భద్రతా అధికారులు కిందకు తోసి చేతులు వెనకకు కట్టి కస్టడీకి తరలించడం వీడియోలలో కన్పించింది. ఈ ఘటన తరువాత అక్కడున్న వారు కింగ్‌ను దేవుడు రక్షించాలి అని వేడుకుంటూ నిరసనకు దిగిన వాడిని తిట్టిపోస్తూ సాగారు. ప్రిన్స్‌పై ఆగంతకుడు గుడ్డు విసిరింది నిజమే కానీ ఇది ఆయనను తగలలేదని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News