Wednesday, January 22, 2025

గ్రేటర్ నోయిడాలో బాలుని దురాగతం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఒక మైనర్ బాలుడు ఒక ఎత్తైన భవనంపై నుంచి నెల రోజుల కుక్క పిల్లను విసిరి దాని మరణానికి కారణమైనట్లు సూచిస్తున్న ఒక వైరల్ వీడియో ఆధారంగా ఒక ఎన్‌జిఒ దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న గ్రేటర్ నోయిడా పోలీసులు ఒక కేసు నమోదు చేసినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. ఒక ఎత్తైన భవనంలో నివసిస్తున్న సుమారు 9, 10 ఏళ్ల బాలుడు ఆ దురాగతానికి పాల్పడున్నట్లుగా సూచిస్తున్న వీడియోను ప్రధానంగా పేర్కొంటూ పీపుల్స్ ఫర్ ఏనిమల్స్ (పిఎఫ్‌ఎ) వాలంటీర్ సుర్భి రావత్ ఆ ఫిర్యాదు దాఖలు చేశారు.

సామాజిక మాధ్యమ వేదికలలో పంపిణీ అయిన ఆ ఫుటేజ్‌లో ఒక పొదలో తన తోటి కుక్క పిల్లలతో ఉన్న ఆ కుక్క పిల్లను బాలుడు చాలా నిర్లక్షంగా చేతుల్లోకి తీసుకోవడం కనిపించింది. ఒక వయోజనుని పర్యవేక్షణలో ఆ బాలుడు నిర్దాక్షిణ్యంగా సుమారు నెల రోజుల కుక్క పిల్లలను ఎత్తుకుని రోడ్డు వైపు వెళ్లినట్లు, అది కుయ్యోమంటూ తన నిర్బంధం నుంచి తప్పించుకునేందుకు విఫలయత్నం చేసినట్లు ఆ వీడియో క్లిప్‌లో ఉందని ఎఫ్‌ఐఆర్ వివరించింది. కుక్క పిల్ల బాధను పట్టించుకోని బాలుడు ఎత్తు నుంచి కిందకు విసరగా అది చనిపోయిందని ఎఫ్‌ఐఆర్ తెలిపింది. బాలుని జువెనైల్ కోర్టులో హాజరు పరచాలని, అతని మానసిక స్థితిని పరీక్షించాలని ఎఫ్‌ఐఆర్ కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News