Monday, December 23, 2024

జూలై 3న #BoyapatiRAPO టైటిల్ గ్లింప్స్

- Advertisement -
- Advertisement -

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో రూపొందిన ‘#BoyapatiRAPO’ చిత్రం సెప్టెంబర్ 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. నిర్మాతలు ఇటీవల రామ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌తో ప్రమోషన్‌లను ప్రారంభించారు.  టీజర్  మాస్‌ తుఫాను సృష్టించింది.

జులై 3నగ్లింప్స్ ద్వారా టైటిల్‌ను లాంచ్ చేయనున్నారు . యాక్షన్‌తో కూడిన రగ్గడ్  అవతార్‌లో రామ్‌ని ప్రెజెంట్ చేసే  ఊరా మాస్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. పోస్టర్ సూచించినట్లుగా టైటిల్ గ్లింప్స్ తుఫాను క్రియేట్ చేయనుంది.  మోస్ట్ హ్యాపెనింగ్ నటి శ్రీలీల రామ్ సరసన కథానాయిక. రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ థం డర్  కు అద్భుతమైన స్పందన వచ్చింది.

సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నతమైన సాంకేతిక ప్రమాణాలు,  నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు. జీ స్టూడియోస్ , పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఎడిటింగ్‌ తమ్మిరాజు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News