Saturday, December 28, 2024

నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం ప్రజావ్యతిరేకం: రవిశంకర్ ప్రసాద్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌ను ముఖ్యమంత్రులు బాయ్‌కాట్ చేయడాని బిజెపి శనివారం తప్పుపట్టింది. ఈ సమావేశంలో 2047 నాటికి భారత్‌ను ఎలా అభివృద్ధి చెందిన దేశంగా మలచాలన్న దానిపై చర్చించడానికి పెట్టుకున్నది. అందుకు ఆరోగ్య, నైపుణ్యాభివృద్ధి, మౌలికాభివృద్ధి, మహిళా సాధికారత వంటి విషయాలపై చర్చ జరిగింది.

బిజెపి నాయకుడు, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశాభివృద్ధికి రోడ్డు మ్యాప్, లక్షం, ఫ్రేమ్‌వర్క్ వంటివి నిర్ణయించే కీలక సంఘం నీతి ఆయోగ్ అన్నారు. నీతి ఆయోగ్ మండలి సమావేశంలో చర్చించేందుకు 100 అంశాలను ప్రతిపాదించాం, కానీ ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి హాజరు కావడంలేదు అని తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ సహా ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరు కావడం లేదు. ‘వంద అంశాలపై చర్చించే సమావేశానికి వారు రావడం లేదు. వారు తమ రాష్ట్రాల గళాన్ని వినిపించడం లేదు. ఇది చాలా దురదృష్టకరం, ప్రజావ్యతిరేకం. ప్రధానిని వ్యతిరేకిస్తూ మీరు ఎంత దూరం పోగలరు’ అని రవి శంకర్ ప్రసాద్ ప్రశ్నించారు.
‘మీరు మోడీని వ్యతిరేకించడానికి మరిన్ని అవకాశాలు పొందొచ్చు. కానీ మీరు మీ రాష్ట్ర ప్రజలకు హాని తలపెట్టడం లేదా? ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యం. మీ రాష్ట్రాల ప్రజాప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు’ అంటూ ప్రసాద్ విరుచుకుపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News