Sunday, December 22, 2024

కూకట్‌పల్లిలో ప్రియుడితో కలిసి భర్తను చంపి… అగ్నిప్రమాదంగా చిత్రీకరించారు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అగ్ని ప్రమాదంగా చిత్రీకరించి భర్తను భార్య తన ప్రియుడితో కలిసి సజీవదహనం చేసిన సంఘటన మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లిలో జరిగింది. దీంతో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కూకట్‌పల్లిలో జిమ్ ట్రైనర్ జయకృష్ణ మద్యం మత్తులో ఉన్నప్పుడు అతడిపై పెట్రోల్ పోసి తగలబెట్టింది. అనంతరం తన భర్త అగ్నిప్రమాదంలో చనిపోయాడని అందరిని నమ్మించాడు. జిమ్ ట్రైనర్ మృతి పై పలు అనుమానాలు ఉండడంతో ఆమె భార్యను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ప్రియుడితో కలిసి భార్యను చంపిన అనంతరం అగ్ని ప్రమాదంగా చిత్రీకరించామని నిందితులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: ఒక పక్క ఎండలు.. మరో వైపు జల్లులు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News