Monday, December 23, 2024

ప్రేయసి పెళ్లికి అంగీకరించడం లేదని..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తాను ప్రేమించిన యువతి పెళ్లికి అంగీకరించడం లేదని ఓ యువకుడు ప్రేయసి గొంతు కోసి తీవ్రంగా గాయపరిచిన ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికులు, మడికొండ పోలీస్ ఇన్ స్పెక్టర్ గుజ్జేటి వేణు కథనం ప్రకారం కడిపికొండకు చెందిన సివ్వి శ్రీనివాస్ అదే గ్రామానికి చెందిన యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

కానీ వీరి ఇద్దరి మతాలు వేరు. అయినప్పటికి ప్రేయసి కోసం అతడు ఆమె మతాన్ని స్వీకరించినట్లు తెలిసింది. పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఇద్దరు కొద్దిరోజులుగా గొడవ పడుతున్నారు. శ్రీనివాస్ మంగళవారం రాత్రి ప్రేయసి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుందామని నిలదీశాడు. ఆమె అంగీకరించలేదు. దీంతో సహనం కోల్పోయిన శ్రీనివాస్ ప్రేయసి గొంతు, చేయి కోసి గాయపరిచాడు. ఆగ్రహించిన ఆమె కుటుబ సభ్యులు యువకుడిని చితకబాదారు. గాయపడిని యువతిని వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News