Wednesday, January 22, 2025

మియాపూర్‌లో ప్రియురాలిపై ప్రియుడు కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

హైద‌రాబాద్ : ప్రేమ పేరుతో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమ విఫలమైనా, ప్రేమను నిరాకరించినా ప్రియురాలిపై దాడి చేస్తూ వారి ప్రాణాలను బలిగొంటున్నారు. తాజాగా నగరంలో మియాపూర్‌లోని ఆదిత్య న‌గ‌ర్‌లో దారుణం చోటుచేసుకుంది.

ఓ యువ‌కుడు త‌న ప్రియురాలు, ఆమె తల్లిపై కత్తితో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసి, తీవ్రంగా గాయ‌ప‌రిచాడు. అనంతరం ఆ యువ‌కుడు త‌న గొంతు కోసుకున్నాడు. యువ‌కుడు సందీప్‌కు తీవ్ర గాయాలు కావ‌డంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. త‌ల్లీకూతుళ్ల‌ను కూడా స‌మీప ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News