Sunday, January 19, 2025

ప్రేయసితో లాడ్జికి వచ్చాడు… బాత్రూమ్‌లో ప్రియుడి మృతదేహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రియురాలితో కలిసి లాడ్జికి వచ్చి అక్కడ ప్రియుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సంఘటన హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. జడ్చర్లకు చెందిన హేమంత్(28) వివాహ వేడుకుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ అమ్మాయితో అతడికి ఏడేళ్ల క్రితం పరిచయం కావడంతో ప్రేమకు దారితీసింది. ఆమె కూడా శుభకార్యం కోసం హైదరాబాద్‌కు రావడంతో ఇద్దరు కలుసుకున్నారు. ఇదరు కలిసి అమీర్‌పేటలో ఓయో లాడ్జీలో రూమ్ తీసుకొని బస చేశారు. మద్యం తాగిన అనంతరం అతడు రాత్రి రెండు గంటల సమయంలో బాత్రూమ్‌లోకి వెళ్లి కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రియురాలి స్పందించి అతడిని బెడ్ పై పడుకోబెట్టి ప్రియుడి స్నేహితులకు సమాచారం ఇచ్చింది. స్నేహితులు వచ్చి 108కి సమాచారం ఇవ్వడంతో అప్పటికే అతడు మృతి చెందినట్టు నిర్ధారించారు. స్నేహితులు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు ఓయో లాడ్జీకి చేరుకొని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News