Monday, December 23, 2024

కొలిక్కి రాని గంగోత్రి ప్రేమ వ్యవహారం

- Advertisement -
- Advertisement -

మోస్రా: నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్ర గోవూర్ గ్రామంలో వారం, పది రోజుల నుండి ఎరుకల గంగోత్రి అదే గ్రామానికి చెందిన బిసి వర్గం (కుమ్మరి) నరేష్ ప్రేమ వ్యవహారం పది రోజులైనా కొలిక్కి రాకపోవడం వివాదానికి దారితీస్తుంది. పది సంవత్సరాల నుండి గంగోత్రితో కుమ్మరి నరేష్ ప్రేమ కార్యకలాపాలు నడిపి ఆమెను పెళ్లి చేసుకోకపోవడం ఎంత వరకు సమంజసమని, గంగోత్రిని శారీరక సుఖాన్ని అనుభవించిన కుమ్మరి నరేష్ ఇప్పుడు తల్లిదండ్రులు వద్దంటున్నారని అనడం ఎంతవరకు సమంజసమని అని జిల్లా మహిళా సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

కావాలని నరేష్ తల్లిదండ్రులపై ప్రేమ వ్యవహారం రుద్దడం సరైన పద్దతి కాదని జిల్లా మహిళా సంఘాలు తెలిపాయి. గంగోత్రి బుధవారం నిజామాబాద్ సిపిని కలిపి ఈ ప్రేమ వ్యవహారాన్ని తెలియపరిచినట్లు బాధిత మహిళ తెలియజేసింది. నిజామాబాద్ సిపి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రేమ వ్యవహారాన్ని పరిష్కరిస్తానని చెప్పినట్లు బాధిత మహిళా గంగోత్రి పేర్కొంది. జిల్లా మహిళా సంఘ ప్రతినిధులు గంగోత్రిని నరేష్ పెళ్లి చేసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేయనున్నట్లు మహిళా సంఘ ప్రతినిధులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News