Thursday, January 23, 2025

పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ప్రియురాలి కూతురిని కిడ్నాప్ చేసిన ప్రియుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇద్దరు పిల్లలు ఉన్న మహిళతో ఓ యువకుడు సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి చేసుకుందామని ఆమెను బలవంత పెట్టాడు… కలిసి జీవిద్దాం కానీ పెళ్లి చేసుకోను అని ఆమె చెప్పడంతో సదరు మహిళ కూతురును అతడు కిడ్నాప్ చేసిన సంఘటన యదాద్రి భువనగిరి జిల్లా అల్లాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. 2017లో రషీద్ అనే వ్యక్తిని సదురు మహిళ పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు మధ్య గొడవలు జరగడంతో ఆమె విడాకులు తీసుకుంది. ఆమెకు శంకర్(21) అనే యువకుడు పరిచయం కావడంతో మోతీనగర్‌లో సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకుందామని పలుమార్లు ఆమెతో చెప్పాడు. కానీ ఆమె మాత్రం పెళ్లి వద్దు సహజీవనం చేద్దామని సూచించింది. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఈ నెల 14న ఆమె కూతురును శంకర్ కిడ్నాప్ చేశాడు. దీంతో సదరు మహిళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News